కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యులతో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ సమావేశమయ్యారు. ఎన్ఎమ్ఎసీ బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్ వైద్యులు అత్యవసర సేవలను బహిష్కరించారు. ఈ చర్యతో రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో రోగులకు ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించేందుకు పారా మెడికల్ సిబ్బందితో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ప్రధానంగా గైనకాలజి, ఏఎంసి, పిడియాట్రిక్, అత్యవసర విభాగాల్లో సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు.. రోగులు అధికంగా ఉన్న వార్డుల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీచూడండి.ఐటీఆర్ ఫైల్ చేశాక రిఫండ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలి?