కన్న తల్లిని బస్టాండ్లో వదిలి వెళ్లిన కొడుకుపై కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓర్వకల్లు మండలం బ్రాహ్మణపల్లె బస్టాండ్లో దీనావస్థలో ఉన్న ఓ వృద్ధురాలిని బుధవారం ఎమ్మెల్యే గమనించి ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తనకు కొడుకు ఉన్నడని వృద్దురాలు ఆయనకు తెలిపింది. వెంటనే ఆమె కుమారుడికి ఫోన్ చేసిన కాటసాని.. తల్లిని బస్టాండ్లో ఎందుకు వదిలివెల్లావని ప్రశ్నించారు. అతను సరైన సమాధానం ఇవ్వకపోవటంతో బస్టాండ్ పక్కన ఉన్న హోటల్ యజమానికి వృద్ధురాలి బాధ్యతను అప్పజెప్పి ఆర్థిక సహయం చేశాడు. ఏ అవసరం వచ్చిన తనకు తెలపాలని అవ్వకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సూచించారు. తల్లిని పట్టించుకోని కొడుకుపై కేసు నమోదు చేయాలని ఓర్వకల్లు ఎస్సైకు ఎమ్మెల్యే సుచించారు.