ETV Bharat / state

క్వింటాలు ఉల్లి@ 10 వేల రూపాయలకు పైనే...! - onions latest news

ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా... చాలా మంది రైతులు ఉల్లి పంట వేయలేదు. మరోవైపు ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కర్నూలు ఉల్లికి డిమాండ్ పెరిగింది.

క్వింటాలు ఉల్లి 10 వేల రూపాయలకు పైనే...!

author img

By

Published : Dec 2, 2019, 11:53 PM IST

కర్నూలు మార్కెట్‌లో ఉల్లి.. రికార్డు ధర పలికింది. క్వింటాల్‌ ఉల్లి 10 వేల 180 రూపాయల ధరకు రైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. వారం రోజుల క్రితం... క్వింటాలు ఉల్లి 7 వేల 400 పలకగా... ఇవాళ 10 వేలకు పైగా పలికి కొత్త రికార్డును సృష్టించింది. కర్నూలు జిల్లాలోని కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, బనగానపల్లి, డోన్ నియోజకవర్గాల్లో సుమారు 30 వేల హెక్టార్లలో ఉల్లిని సాగు చేశారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా... చాలా మంది రైతులు పంట వేయలేదు. భారీ వర్షాలకు వేసిన పంట కుళ్లిపోయింది. మరోవైపు ఉల్లిని ఎక్కువగా పండించే మహారాష్ట్ర, గుజరాత్, కర్నాటక రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు, వరదల కారణంగా ఉల్లి పంట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో కర్నూలు ఉల్లికి డిమాండ్ పెరిగింది.అయితే పదివేలు పలకడం వల్ల కర్నూల్‌ ఉల్లి రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రస్తుతం మార్కెట్‌కు వెయ్యి క్వింటాళ్ల ఉల్లి మాత్రమే వస్తోంది. వ్యాపారులతో పోటీపడి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉల్లిని కొనుగోలు చేస్తోంది.

Intro:ap_knl_13_02_ulli_high_rate_avbb_ap10056
కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో ఉల్లి రికార్డు ధరను నమోదు చేసుకుంది .ఉల్లి క్వింటం గరిష్టంగా 10180 రూపాయలకు అమ్ముడుపోయింది. ఉల్లి కి మంచి ధర రావడం తో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉల్లి సరుకు తక్కువగా రావడంతో ధరలు పెరుగుతున్నాయని ఇంకా ధరలు పేరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. ఈరోజు ఉల్లికి వచ్చిన ధర కర్నూలు మార్కెట్టు చరిత్రలో ఎప్పుడు రాలేదనని అధికారులు తెలిపారు.
బైట్. జయలక్ష్మి. వ్యవసాయ మార్కెట్ కార్యదర్శి.
ఉల్లి రైతులు

Body:ap_knl_13_02_ulli_high_rate_avbb_ap10056

Conclusion:ap_knl_13_02_ulli_high_rate_avbb_ap10056
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.