కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మార్కెట్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉల్లి కొనుగోలు కేంద్రంలో... సరకు నాణ్యతగా లేదని అధికారులు తిరస్కరించారు. మరో వైపు జిల్లాలో కురుస్తున్న అధిక వర్షాలతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉల్లిని అధికంగా సాగు చేసే ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల నుంచి రైతులు పంట అమ్ముకునేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 1500 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశామని అధికారులు తెలిపారు. గ్రేడింగ్‌తో కొనుగోలు ప్రక్రియ మందకొడిగా సాగుతోందని రైతులు చెబుతున్నారు.
ఇదీచదవండి.