కర్నూలు జిల్లా బండిఆత్మకూరు మండలం బోధనం గ్రామం వద్ద మంగళవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెద్ద దేవాలపురం గ్రామానికి చెందిన సామక్క(60) మృతి చెందగా...మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులు నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పెద్ద దేవాలపురం గ్రామానికి చెందిన వీరంతా వ్యవసాయ కూలీలు. గడివేముల మండలం గని గ్రామంలో పొలం పనులు ముగించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి