గడిచిన 24 గంటల్లో.. కర్నూలు జిల్లాలో 26 కొవిడ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్కరు కూడా మరణించలేదు. వైరస్ సోకిన 240 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
గతంతో పోలిస్తే జిల్లాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పటి వరకు మొత్తం 59,998 మందికి కొవిడ్ పాజిటివ్ అని తేలగా.. 59,275 మంది మహమ్మారిని జయించి ఇళ్లకు వెళ్లినట్లు వైద్యాధికారులు తెలిపారు. 483 మంది వైరస్ ధాటికి బలయ్యారని వెల్లడించారు.
ఇదీ చదవండి: