కర్నూలు జిల్లా చాగలమర్రి జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బ్లాక్‌బోర్డులు లేక ఉపాధ్యాయులు పలకపై పాఠాలు బోధిస్తున్నారు. ఈ బడిని ‘నాడు-నేడు’ మొదటి విడతలో భాగంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం రూ.1.34 కోట్లు కేటాయించింది. ఎలాగూ బాగు చేస్తున్నామని శిథిలమైన బ్లాక్‌బోర్డులు తొలగించింది. ఇప్పటికీ ఏడాది దాటినా కొత్త బోర్డులు ఏర్పాటు చేయలేదు. గుత్తేదారు మాత్రం రూ.40లక్షల పనులు చేస్తే.. కేవలం రూ.20 లక్షలే విడుదల అయ్యాయని పనుల్లో వేగం తగ్గించారు. ఫలితంగా విద్యార్థులు అసంపూర్తి పనులు, అరకొర సౌకర్యాల మధ్యే చదువులు సాగించాల్సి వస్తోంది. ముఖ్యంగా బోధనకు అవసరమైన బ్లాక్‌బోర్డులు లేకపోవడంతో ఉపాధ్యాయులు పలకలపైనే రాసి, పాఠాలు అర్థం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మొత్తం 26 తరగతి గదుల్లో 1300 మంది విద్యార్థులు చదువుతున్నారు. కనీసం నీటి వసతి, మరుగుదొడ్లూ లేవు.
ఇదీ చదవండి: