తుంగభద్ర నది పుష్కరాలు కర్నూలు జిల్లాలో తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. వర్షం కాస్త తగ్గుముఖం పట్టటంతో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అయితే కరోనా కారణంగా మొదటిరోజు నుంచి తక్కువ సంఖ్యలో భక్తులు వస్తుండటం కొంతమేర పుష్కరాల సందడి తగ్గింది. అధికారులు స్నానాలు చేసేందుకు వచ్చే భక్తులకు, పుష్కర ఘాట్ల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా డిసెంబర్ 1న పుష్కరాలు ముగియనున్నాయి.
ఇవీ చూడండి...