కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలో ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను జాతీయ హరిత ట్రైబునల్ ( ఎన్. జి. టి ) బృందం సభ్యులు తనిఖీ చేశారు. జూన్ 27 న ఫ్యాక్టరీ ఉప యూనిట్ నంద్యాల గ్యాస్ లిమిటెడ్ లో గ్యాస్ లీకై జెనరల్ మేనేజర్ మృతి చెందారు.
పరిశ్రమలో చోటు చేసుకున్న ఈ ఘటనపై విచారించేందుకు జాతీయ హరిత ట్రైబునల్ బృందం పరిశ్రమను సందర్శించింది. జిల్లా కలెక్టర్ వీరపాండ్యయన్ తో కలిసి ఘటనపై చర్చించారు. ప్రమాదం జరిగిన ప్రదేశం, చుట్టూ పరిసరాలు పరిశీలించారు. కొంతమంది సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: