కర్నూలు జిల్లా నంద్యాల చిన్నచెరువు సమీపంలో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరకులను అందజేశారు. ఆపద్భాందవ సేవ సొసైటీ సభ్యులు, నంద్యాల రైల్వే పోలీసులు బియ్యం, నూనె, కందిపప్పు తదితర వస్తువులను పేదలకు ఇచ్చారు. లాక్డౌన్ కాలంలో పేదల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తమ వంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: కర్నూలులో పారిశుద్ధ్య కార్మికులకు ఆర్థిక సహాయం