ఆదోనిలో అక్రమ కట్టడాలను పురపాలక అధికారులు గుర్తించి తొలిగిస్తున్నారు. పట్టణం 8 వార్డులో రెండవ రోజు 'మన ఆదోని - మన స్వచ్ఛత' పారిశుద్ధ్య పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా డ్రైనేజీలపై అక్రమంగా నిర్మించిన కట్టడాలను.. పురపాలక సిబ్బంది తొలగిస్తున్నారు. వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని అక్రమ కట్టడాలను జేసీబీలతో తొలగించి పారిశుద్ధ్య పనులు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆర్జీవీ కృష్ణ, వైకాపా యువ నాయకుడు మనోజ్, ఛైర్మన్ భర్త నాగేంద్ర పాల్గొన్నారు.
ఇదీ చదవండీ.. పురోహితుల కోసం 'పురోహిత్ క్రికెట్ లీగ్'