ETV Bharat / state

mpp-elections: వైకాపాలో వర్గవిభేదాలను బయటపెడుతున్న ఎంపీపీ ఎన్నికలు - ఎంపీపీ

మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికలు.. వైకాపా(ycp)లో వర్గ విభేదాలను బయటపెడుతున్నాయి. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేస్తున్న తమను కాదని.. కొత్తగా పార్టీలోకి వచ్చినవారికి పదవిలిస్తున్నారని.. కొంత మంది వైకాపా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైకాపాలో వర్గవిభేదాలను బయటపెడుతున్న ఎంపీపీ ఎన్నికలు

author img

By

Published : Sep 23, 2021, 7:55 PM IST

కర్నూలు జిల్లా గూడూరు మండలం ఎంపీపీ(MPP) పదవి.. కోడుమూరు నియోజకవర్గంలో దుమారం రేపుతోంది. ఎమ్మెల్యే (MLA) సుధాకర్‌రెడ్డి.. కే నాగలాపురం ఎంపీటీసీ లక్కిరెడ్డి రాజమ్మకు, పార్టీ ఇన్‌ఛార్జ్‌ హర్షవర్థన్‌ రెడ్డి చనుగొండ్ల-1 ఎంపీటీసీ సునీతకు..ఎంపీపీ పదవి కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో లక్కిరెడ్డి రాజమ్మకు ఎంపీపీ(MPP) పదవి ఇవ్వకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని.. కార్యకర్తలతో కలిసి..ఆమె కుమారుడు నరసింహారెడ్డి నిరసనకు దిగారు.

12 ఏళ్లగా పార్టీ కోసం పనిచేస్తున్న తమను కాదని.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానంతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే సుధాకర్‌.. నరసింహారెడ్డికి హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి: ఎంపీపీ పదవి ఇస్తానని ఎమ్మెల్యే మాట మార్చారు: వైకాపా ఎంపీటీసీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.