ETV Bharat / state

'భూములు రిజిస్ట్రేషన్‌ చేయకుండా మోసం చేశారు' - ap minister Jayaram latest news

భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా తమను మోసం చేశారంటూ..మంత్రి జయరాం కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి జయరాం సతీమణి రేణుకమ్మ, మంత్రి సోదరులు నారాయణస్వామి, శ్రీనివాసులు సతీమణులు త్రివేణి, ఉమాదేవి కర్నూలు జిల్లా ఆస్పరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

minister Jayaram
minister Jayaram
author img

By

Published : Oct 11, 2020, 9:40 AM IST

ఇట్టినా సంస్థ నుంచి తాము భూములు కొనుగోలు చేశామని, వాటిని మరొకరికి రిజిస్ట్రేషన్‌ చేసి తమను మోసం చేశారని కార్మికశాఖ మంత్రి జయరాం సతీమణి రేణుకమ్మ, మంత్రి సోదరులు నారాయణస్వామి, శ్రీనివాసులు సతీమణులు త్రివేణి, ఉమాదేవి కర్నూలు జిల్లా ఆస్పరి పోలీసుస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. ఆ సంస్థకు చెందిన భూములను మంత్రి భార్య రేణుకమ్మ పేరున 30 ఎకరాలు, మంత్రి సోదరుడి భార్య త్రివేణి పేరున 33 ఎకరాలు, మరో సోదరుడి భార్య ఉమాదేవి పేరున 31 ఎకరాలు కొన్నామని చెప్పారు. ఆ భూములను ఇట్టినా సంస్థ మాజీ డైరెక్టర్‌ మంజూనాథ్‌, సంస్థ ప్రతినిధులు మను, మానీషా, మహదేవప్పలు ఇతరులకు రిజిస్ట్రేషన్‌ చేశారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదైంది.

ఇదీ చదవండి: సంచనాల స్వైటక్.. ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.