తన స్వగ్రామంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంతో.. తనకు, తన తమ్ముళ్లకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇసుక మాఫియా, మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక ఏర్పాటు చేశామని తెలిపారు. ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడేవారు ఎంతటి వారైనా ఉపేక్షించవద్దని పోలీసులకు సూచించారు.
తమ గ్రామం కర్నూలు, అనంతపురం, కర్ణాటక సరిహద్దులో ఉండటంతో కొంతమంది ఇలాంటి అసాఘింక చర్యలు సాగిస్తున్నారన్నారు. పోలీసులపై దాడి కేసులో పరారీలో ఉన్న చిప్పగిరి వైకాపా మండల కన్వీనర్ నారాయణను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
'నా స్వగ్రామం గుమ్మనూరు అయినప్పటికీ నేను, నా కుటుంబసభ్యులు ఎన్నో ఏళ్లుగా ఆలూరులో నివాసం ఉంటున్నాము. గుమ్మనూరులో జరిగిన పేకాటకు నాకు, నా తమ్ముళ్లకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులో ఎంతటివారున్నప్పటికీ వారిని ఉపేక్షించవద్దని పోలీసులకు సూచిస్తున్నాను.' -- జయరాం, మంత్రి
ఇవీ చదవండి..