రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు అధికం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్నివిధాల ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. కర్నూలు జిల్లాలో 3 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 15 ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ బాధితులకు చికిత్స చేసేందుకు అనుమతి ఇచ్చామన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రభుత్వం సూచించిన ఛార్జీలు మాత్రమే వసూలు చెయ్యాలని, లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మందుల కొరత లేదని, అంబులెన్స్ సర్వీసులను పెంచే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రానికి మరో 2 లక్షల కొవిడ్ టీకాలు