కర్నూలు జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని అర్హులకు రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయి. ఆర్.ఎస్ చెంచుకాలనీలో నూట ఎనిమిది అంత్యోదయ కార్డులు ఉన్నాయి. ప్రతి కార్డుకు 35కిలోల చొప్పున బియ్యం అందించాలి. కానీ తక్కువగా కేటాయింపులు చేస్తున్నారు. ఈ సమస్యపై కాలనీ వాసులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
విచారణ చేపట్టిన అధికారులకు 230 క్వింటాళ్ల బియ్యం రేషన్ దుకాణంలో నిల్వ ఉన్నట్లు ఈ-పాస్ యంత్రం చూపించింది. మూడేళ్లుగా ఈ-పాస్ యంత్రం సాయంతో కాకుండా కాగితాల్లో పేర్లు నమోదు చేసి కార్డు దారులకు బియ్యం ఇచ్చినట్లు తేలింది. కానీ కొంతమందికి మాత్రమే బియ్యం ఇచ్చి మిగతా బియ్యాన్ని డీలర్లు దారి మళ్లించినట్లు స్థానికులు చెబుతున్నారు. నిల్వ ఉన్న బియ్యంపై పూర్తి వివరాలు తెలుసుకున్నాకే చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: