కర్నూలు జిల్లా మహానంది మండలం శ్రీనగరం గ్రామానికి చెందిన రమేష్.. నంద్యాల మండలం వేంకటేశ్వరపురం గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరయ్యాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా నంద్యాల పట్టణంలోని ఫరూక్ నగర్ వద్ద రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రమేష్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టింది.
గమనించిన స్థానికులు.. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ రమేష్‌ను నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రమేష్ మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:
విజయవాడ రైల్వే స్టేషన్ యార్డులో భారీ మార్పులు.. తగ్గనున్న రైళ్ల నిరీక్షణ సమయం