ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. శ్రీగిరి క్షేత్రాన్ని శోభాయమానంగా ముస్తాబు చేసి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. ప్రవేశ మార్గాల వద్ద స్వాగత తోరణాలు, షామియానాలు ఏర్పాటు చేశారు. ఆలయ క్యూలైన్లను సిద్ధం చేశారు. . ఈ రోజు ఉదయం 9.45 గంటలకు దేవస్థానం ఈఓ కె.ఎస్. రామారావు, అర్చకులు యాగశాల ప్రవేశం చేసి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామివార్ల దేవాలయాలను విద్యుద్దీపాలంకరణలతో ముస్తాబు చేశారు
సాయంత్రం సకల దేవతలను ఆహ్వానిస్తూ ప్రధాన ధ్వజస్తంభం పై ధ్వజ పటాన్ని ఆవిష్కరించనున్నారు.బ్రహ్మోత్సవాల ప్రారంభం కానుండడంతో శివ దీక్షలు ధరించిన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. శివ నామ స్మరణ చేసుకుంటూ భక్తులు పాదయాత్రగా శ్రీగిరికి చేరుతున్నారు.
ఇదీ చూడండి: