ఆదోని మండలం కుప్పగల్లు గ్రామ కొండల్లో చిరుత పులుల సంచారం స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రెండు చిరుత పులులను స్థానికంగా ఉన్న కొండపై చూసిన మూగజీవాలు అరుపులు మెుదలు పెట్టాయి. దీంతో పొలం పనులు చేసుకుంటున్న రైతులు వెంటనే తేరుకొని అక్కడ నుంచి పరుగు తీశారు. గ్రామస్థులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. పొలం పనులకు వెళ్లాలంటే భయమేస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులుల బారి నుంచి రక్షించాలంటూ.. అధికారులను వేడుకుంటున్నారు.
ఇదీ చదవండీ... శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల