ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా కర్నూలులోని ఏపీఎస్‌పీ మైదానంలో లక్ష్మీదీపారాధన వేడుక వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, లక్ష్మీ దేవి ఉత్సవమూర్తుల సమక్షంలో జరిగిన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది. వైదిక మంత్ర పఠనం, శ్లోకప్రార్థనతో కార్యక్రమం ప్రారంభమైంది. అలమేల్ను మంగ నామావళి, అష్టలక్ష్మీ వైభవం నృత్య రూపకం, గోవిందనామాల పారాయణం భక్తిభావంలో ముంచెత్తాయి. ఈ దీపారాధనలో మంత్రాలయం పీఠాధిపతి సుబుదేందు తీర్థులు, టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
కన్నుల పండుగగా లక్ష్మీ దీపారాధన వేడుక - కర్నూలులో ధనుర్మాస ఉత్సవాలు
కర్నూలులోని ఎపీఎస్‌పీ మైదానంలో లక్ష్మీ దీపారాధన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, లక్ష్మీ దేవి ఉత్సవమూర్తుల సమక్షంలో జరిగిన కార్యక్రమం విశేషంగా ఆకట్టుకుంది.