ETV Bharat / state

తల్లి ఆత్మహత్య... అనాథలైన ఇద్దరు పిల్లలు - dhone city

క్షణికావేషంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం కారణంగా.. చిన్న పిల్లలు అనాథలుగా మిగిలారు. భర్తతో మనస్పర్ధల కారణంతో భార్య పుష్పలత ఆత్యహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో చోటు చేసుకుంది.

తల్లి ఆత్మహత్య... అనాథలైన పిల్లలు
author img

By

Published : Sep 8, 2019, 5:02 PM IST

తల్లి ఆత్మహత్య... అనాథలైన పిల్లలు

కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని ప్రజా వైద్యశాల వీధిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. భర్త విశ్వనాథ్ శెట్టితో భార్య పుష్పలతకు కొన్ని రోజులుగా మనస్పర్థలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మేడపైకి వెళ్లి ఒంటిపై డీజిల్ పోసుకుని నిప్పంటించుకుంది. కేకలు వేయడంతో స్థానికులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.

స్పందించిన కుటుంబ సభ్యులు గోనె సంచి కప్పి మంటలు ఆర్పారు. అప్పటికే పుష్పలత మృతి చెందింది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. క్షణికావేషంలో ఆ తల్లి తీసుకున్న నిర్ణయం కారణంగా... చిన్న పిల్లలు అనాథలుగా మిగిలారు. పుష్పలత గత మూడు రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ... నాన్న.. నన్నెందుకు ఇలా చేశావ్!

Intro:కొంగు బంగారం కుళ్లాయిస్వామి...

కనుల పండువగా ఉత్సవాలు

నార్పల మండలంలోని గూగుడు కుళ్లాయిస్వామి క్షేత్రం మత సామరస్యానికి ప్రతీక కొలిచే వారికి కొంగు బంగారం గూగుడు బ్రహ్మోత్సవాల్లో భాగంగా క్షేత్రంలో కుళ్లాయిస్వామి పీర్లు కొలువుదీరాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు చిన్న సరిగెత్తు ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వచ్చి తరలివచ్చారు.కుళ్లాయిస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులు కిలోమీటర్ మేర క్యూలైన్ లో నిలబడి గంటల తరబడి నిలబడి దర్శనం చేసుకుంటున్నారు. మహిళలు ,వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కుళ్లాయిస్వామి దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకున్నారు.

Body:శింగనమల

Conclusion:కంట్రిబ్యూటర్: ఉమేష్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.