సమస్యల పరిష్కారం కోసం ఈనెల 26 నుంచి నిరవధిక సమ్మె చేయనున్నట్లు కర్నూలు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల యూనియన్ ప్రకటించింది. సీఎం జగన్ తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయనడం సరికాదన్నారు. కార్మికులకు బకాయి ఉన్న వేతనాలు చెల్లించకుండా, జీతాలు పెంచకుండా ఆర్థిక ప్రయోజనాలు ఎలా నెరవేరుతాయో చెప్పాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైన సీఎం జగన్ స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు.
ఇదీ చదవండి:
బస్తీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరిస్తాం: ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్