కర్నూలు మేయర్ బీవై. రామయ్య, డిప్యూటీ మేయర్ రేణుకా జిల్లాలోని వైకాపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని మేయర్ తెలిపారు. ఇంకా ఇరవై సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి కొనసాగుతాడన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయపార్టీ కూడా మనుగడ సాధించలేవని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును కాదని అగ్రవర్ణాల రిజర్వేషన్లలను తగ్గించి... బీసీలకు పది శాతం ఎక్కువగా ఇచ్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కిందన్నారు. సిటీలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రోడ్డు విస్తరణ పనులు చేపడతామన్నారు. జగన్ పాలనకు ప్రజల్లో మంచి స్పందన వచ్చినందుకే తాము ఎన్నికల్లో గెలిచామని డిప్యూటీ మేయర్ రేణుకా అన్నారు.
ఇదీ చదవండి: గూడూరు నగర పంచాయతీ చైర్మన్‌గా జులపాల వెంకటేశ్వర్లు