వినాయకచవితి ఉత్సవాలపై కరోనా ప్రభావం కనబడుతోంది. అత్యంత వైభవంగా ఈ వేడుకలు కర్నూలులో ప్రతి సంవత్సరం నిర్వహిస్తారు. కర్నూలు నగరంలో ప్రతి సంవత్సరం 15 వందల నుంచి రెండు వేల దాకా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు. కరోనా ప్రభావం కర్నూలులో ఎక్కువగా ఉన్నందున ఈ సంవత్సరం భారీ విగ్రహాలు ఏర్పాటు చేయరాదని వినాయక ఉత్సవ కమిటీ నిర్ణయించింది.
కేవలం దేవాలయాల్లో 3 నుంచి 5 అడుగుల విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేయాలని.... నిమజ్జన కార్యక్రమంలో ప్రతి విగ్రహనికి దూరం పాటిస్తూ ఐదు నుంచి 15 మంది మాత్రమే పాల్గొనాలని కమిటీ సభ్యులు తెలిపారు. వినాయక చవితి వేడుకలు ఆగస్టు 22న ప్రారంభమై 30వ తేదీ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తారు.
ఇదీ చూడండి