జనతా కర్ఫ్యూతో కర్నూలు జిల్లా ఆదోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. రద్దీగా ఉండే ప్రధాన కూడళ్లు జనాలు లేక నిర్మానుష్యంగా మారాయి. దుకాణాలు, సినిమా హాళ్లు మూసివేశారు. ఆర్టీసీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు లేక బోసిపోయాయి. పట్టణంలోని ప్రజలు స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.