ప్రసిద్ధమైన కర్నూలు జిల్లా యాగంటి ఉమామహేశ్వరస్వామి ఆలయానికి ప్రమాదం పొంచి ఉంది. బనగానపల్లి సమీపంలోని యాగంటి క్షేత్రానికి సమీపంలో చిప్స్ ఫ్యాక్టరీ కోసం పేలుళ్లు జరుగుతున్నాయి. ఆలయానికి 5 కిలోమీటర్ల దూరం వరకు ఎటువంటి మైనింగ్ పనులు చేయరాదన్న నిబంధనలు ఉన్నా... వాటిని కొందరు లెక్క చేయటం లేదు. ఫలితంగా పేలుళ్ల ధాటికి.. యాగంటి ఆలయంలోని స్తంభం కిందికి వాలిపోయింది.
గమనించిన సిబ్బంది తక్షణమే స్పందించి.. స్తంభం కిందపడిపోకుండా చర్యలు చేపట్టారు. 5 ఏళ్ల క్రితం ఈ విధంగానే పేలుళ్ల ధాటికి వెంకటేశ్వరస్వామి గుహలో.. పెచ్చులూడి పడటంతో మైనింగ్ పనులు తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం విచ్చలవిడిగా మైనింగ్ జరుగుతున్నందువల్లే.. ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నయాని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: