కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రెండు దశాబ్దాల క్రితం పంపిణీ చేసిన ఇళ్ల పట్టాల్లో పేదలు వేసుకున్న గుడిసెలను కూల్చివేశారు. ఆ ప్రాంతంలోని బాధితులను జనసేన నియోజకవర్గ బాధ్యురాలు రేఖగౌడ్ పరామర్శించారు. కూల్చిన గుడిసెలను కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. బాధితులతో కలిసి ప్రభుత్వ వైఖరిపై నిరసన తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో వేసుకున్న గుడిసెలను తొలగించడం అన్యాయమని ఆమె మండిపడ్డారు.
ఇదీ చూడండి. రాష్ట్రంలో కొత్తగా 845 కరోనా కేసులు.. ఐదుగురు మృతి