కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మద్యం కోసం జనం ఎగబడ్డారు. దాదాపు నెలన్నర తర్వాత తెరుచుకున్న మద్యం దుకాణాల ముందు క్యూ కట్టారు. భౌతిక దూరం మర్చిపోయి గుంపులు గుంపులుగా నిలుచున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని వరుసలో నిలుచోబెట్టేందుకు చెమటోడ్చారు.
ఇప్పటికే రాష్ట్రంలో కర్నూలు జిల్లాలోనే అత్యధిక కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మద్యం దుకాణాలు తెరవటంతో వైరస్ వ్యాప్తి ఉద్ధృతమవుతుందేమో అని జిల్లా ప్రజలు భయపడుతున్నారు. మందుబాబులను కట్టడి చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: