కర్నూలు నగరంలోని వక్కెరవాగు పొంగి ప్రవహిస్తుండగా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గాజులదిన్నె ప్రాజెక్టుకు.. 60 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ఇప్పటికే 45 వేల క్యూసెక్కుల నీటిని.. దిగువకు విడుదల చేస్తున్నారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని పలు మండలాల్లో.. ఇళ్లలోకి నీరు చేరింది. హంద్రీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దేవనకొండ మండలంలో కరివేముల చెరువు.. పొంగి ప్రవహిస్తోంది. డోన్ మండలం మాల్యాల వద్ద వాగు పొంగుతోంది. గూడూరు మండలం.. నెరవాడ సమీపంలో వక్కెరవాగులో ఇంటర్ విద్యార్థి చంద్రశేఖర్ కొట్టుకుపోగా.. అతడి కోసం గాలిస్తున్నారు. ఆలూరు మండలం మొలగవల్లిలో.. ఇళ్లు కూలి యశ్వంత్ అనే చిన్నారి మృతి చెందాడు.
అనంతపురం జిల్లా డొనేకల్ వద్ద... జాతీయరహదారిపై వరద ఉద్ధృతికి బళ్లారి- గుంతకల్లు మధ్య రాకపోకలు నిలిచాయి. రాయదుర్గం,విడపనకల్లులోని.... పలు ప్రాంతాల్లో వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. గుత్తి మండలంలోని రాజాపురం వద్ద జాతీయరహదారిపై వరద ఉద్ధృతికి ఓ యువకుడు కొట్టుకుపోయాడు. రెండు కిలోమీటర్ల దూరంలో... అతడిని గుర్తించిన స్థానికులు.... కష్టపడి రక్షించారు.
ఇదీ చదవండి: 'కార్గిల్' విజయ గర్వానికి 21 ఏళ్లు