ETV Bharat / state

కోడుమూరులో భారీ వర్షం

కర్నూలు జిల్లా కోడుమూరులో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. స్థానిక పాత బస్టాండ్​లో శతాబ్దం కాలంగా ఉన్న భారీ వేప చెట్టు కూలిపోయింది.

కోడుమూరులో భారీ వర్షం
కోడుమూరులో భారీ వర్షం
author img

By

Published : May 2, 2020, 8:51 PM IST

కర్నూలు జిల్లా కోడుమూరులో భారీ వర్షం కురిసింది. పట్టణంలోని పాత బస్టాండ్​లో 100 ఏళ్లకు పైగా ఉన్న వేప చెట్టు కూలి గ్రామపంచాయతీ భవనాలపై పడింది. పలుచోట్ల కరెంట్​ తీగలు తెగటంతో విద్యుత్​ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండలంలోని పెద్ద బోయగిరి​లోని సుంకులమ్మ ఆలయం సమీపంలో ఉన్న ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. గ్రామంలోని ప్రధాన కూడళ్లలో రోడ్లపైకి నీరు చేరటంతో గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు.

ఇదీ చూడండి: ప్రకాశం జిల్లాలో బీభత్సం సృష్టించిన గాలివాన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.