కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్‌ఫ్లో 2.14 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఆనకట్ట 5 గేట్లను ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. స్పిల్‌వే ద్వారా 1.39 లక్షల క్యూసెక్కులు సాగర్‌కు విడుదల చేశారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తున్నారు. అనంతరం 72 వేల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తారు. జలాశయంలో నీటినిల్వ 214.36 టీఎంసీలుగా ఉంది.
ఇదీ చూడండి: