ETV Bharat / state

పంట పొలాల మధ్య ఇళ్ల స్థలాలు..అభివృద్థికి నోచుకుంటాయా! - ప్రభుత్వం పంపిణీ చేయనున్న ఇళ్ల స్థలాల కోసం ఆసక్తి చూపని లబ్ధిదారులు

వైఎస్​ పాలనలో కర్నూలు జిల్లా ఆదోనిలోని ధనాపురం వద్ద పేదలకు కేటాయించిన ఇందిరమ్మ గృహాలు శిథిలావస్థకు చేరాయి. తాజాగా సీఎం జగన్ ప్రభుత్వం.. ఈనెల 25న ఇళ్ల స్థలాల పంపిణీకి ఆ దగ్గర్లోని పంటపొలాల మధ్య లేఅవుట్​లను సిద్ధం చేసింది. వాటినైనా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తారో లేదోనని అనుమానంతో లబ్ధిదారులు అంతగా ఆసక్తి చూపడం లేదని సమాచారం.

dhanapuram indiramma houses
శిథిలావస్థలోని ఇందిరమ్మ గృహాలు
author img

By

Published : Dec 23, 2020, 9:46 PM IST

housing lands
ప్రభుత్వం పంచనున్న ఇళ్ల స్థలాలు

డిసెంబరు 25న ఇళ్ల స్థలాల పంపిణీ కోసం సీఎం జగన్ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఆ మేరకు కర్నూలు జిల్లా ఆదోనిలోని ధనాపురం వద్ద.. లబ్ధిదారులకు స్థలాలు కేటాయించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. పట్టణ శివారుల్లో పంటపొలాల మధ్య లే అవుట్​లను సిద్ధం చేశారు. ఇక్కడకు దగ్గర్లోనే గతంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టినా మధ్యలోనే వదిలేశారు. తాజాగా ఇవ్వనున్న స్థలాలను అదేవిధంగా పట్టించుకోరేమోనని లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.

dhanapuram indiramma houses
శిథిలావస్థలోని ఇందిరమ్మ గృహాలు

వైఎస్​ పాలనలో పేదలకు పక్కా ఇళ్లను నిర్మించేందుకు.. ఇదే ధనాపురం వద్ద సెంటున్నర స్థలంలో ఇందిరమ్మ గృహాల నిర్మాణం చేపట్టారు. వాటిని లబ్ధిదారులకు కేటాయించినా.. పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగకపోవడం, మౌలిక వసతులు కల్పించకపోవడం కారణంగా అవి శిథిలావస్థకు చేరాయి. ముళ్లపొదలతో నిండిపోయి అడవిని తలపిస్తున్నాయి. ఇప్పడు ఇవ్వనున్న లే అవుట్లూ పట్టణానికి దూరంగా.. పంట పొలాల మధ్య ఉండటం వల్ల ఇవైనా అభివృద్ధికి నోచుకుంటాయా లేక మరో ఇందిరమ్మ గృహాల్లా తయారవుతాయా అని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కలుషిత నీరు తాగి 50 మందికి పైగా అస్వస్థత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.