Silver Jubilee Government College: కర్నూలు నగరంలోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాలలో గోల్డెన్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రిన్సిపాల్ సెక్రటరీ ఐవైఆర్. కృష్ణా రావు, కర్నూలు జిల్లా పూర్వపు కలెక్టర్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సిల్వర్ జూబ్లీ కళాశాలను ఏర్పాటు చేశారని ఐవైఆర్ కృష్ణా రావు తెలిపారు. సిల్వర్ జూబ్లీ కళాశాల లో చదువుకున్నందుకే ఉన్నతస్థానంలో ఉన్నామని ఆయన తెలిపారు. కళాశాలలో చదువుకున్న రోజులను ముఖ్య అతిథులు గుర్తుచేసుకొని వారి అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. ఈ కళాశాల విద్యార్థులుగా ఉన్నందుకు గర్వపడుతున్నమని తెలిపారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి జీవితంలో మంచి పేరు తెచ్చుకోవాలని వక్తలు తెలిపారు.
ఇవీ చదవండి: