ETV Bharat / state

31 రోజుల్లో 292.. జిల్లాలో కట్టడి కాని కరోనా - 292 positive cases in kurnool

జిల్లాలో నెల రోజులుగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. వైరస్‌ కట్టడికి అధికారుల చర్యలు ఫలించటం లేదు. గత నెల 27 వరకు ఒక్క కేసు నమోదు కాకున్నా.. 31 రోజుల్లోనే 292కు చేరుకోవటంతో కర్నూలు జిల్లాను కరోనా జిల్లాగా ఇప్పటికే ప్రచారం చేసేస్తున్నారు. కర్నూలులో 159, నంద్యాలలో 57 కేసులు సంఖ్యను బట్టి తీవ్రత స్థాయిను అర్ధం చేసుకోవచ్చు.

kurnool district
జిల్లాలో కట్టడి కాని కరోనా
author img

By

Published : Apr 28, 2020, 9:51 AM IST

కర్నూలు జిల్లాలో రోజురోజుకి కరోనా పెరిగిపోతోంది. 31 రోజుల్లోనే 292 పాజిటివ్ కేసులు నమోదై రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంది. కర్నూలును కరోనా జిల్లాగా జనం పిలుస్తున్నారు. పోలీసులు వాళ్ల శాయశాక్తల ప్రయత్నిస్తున్నారు. పక్కనున్న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో కర్నూలు వైపు వెళ్లొద్దని పోలీసులు, అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. కర్నూలు, నంద్యాలలో ప్రజలు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. సుమారు 35 ప్రాంతాల్లో రెడ్‌ జోన్‌ అమలు చేస్తున్నారు.

ఇప్పటికే ఆరుగురు వైద్యులు, ఒక ఎస్సై, కానిస్టేబుల్‌, వాలంటీర్‌ కరోనా బారిన పడ్డారు. బాధితుల్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉంటున్నారు. కర్నూలు, నంద్యాలలో నిత్యం కేసులు నమోదు కావడం, ఆత్మకూరు, నందికొట్కూరు, కోడుమూరు, అవుకు, ఆస్పరి, వెల్దుర్తి, కృష్టగిరి, గోనెగండ్లలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్నా కేంద్ర, రాష్ట్ర స్థాయి వైద్య బృందాలు జిల్లాలో పర్యటించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సోమవారం కొత్తగా నమోదైన 13 కేసుల్లో కర్నూలులోనే 10 కేసులు ఉండటంతో వీటి సంఖ్య 159కి చేరింది. పదీ రెడ్‌జోన్‌ ప్రాంతాల నుంచే నమోదయ్యాయి. కోడుమూరులో 60 సంవత్సరాల వృద్ధుడు దిల్లీకి పోయివచ్చిన వారితో తిరగడంతో క్వారంటైన్‌లో సుమారు 14 రోజులు ఉన్నారు. ఇంటికి వచ్చిన పది రోజుల తర్వాత ఇప్పుడాయనకు పాజిటివ్‌గా నమోదైంది. ఈయన పది రోజులుగా కాలనీల్లో, ఇతర ప్రాంతాలకు తిరిగారు. ప్రస్తుతం ఆయనతో తిరిగిన వారందరు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్ల చిన్నారికి కూడా పాజిటివ్‌ వచ్చింది. ఆస్పరి మండలం జోలాపురంలో రెండేళ్ల చిన్నారికి వచ్చింది. ఈ కుటుంబానికి చెందిన అల్లుడు కర్నూలుకు చెందిన వ్యక్తి. దిల్లీకి వెళ్లివచ్చిన తరువాత ఈ ఇంటికి రావడంతో వారిని కర్నూలు క్వారంటైన్‌కు తరలించారు. 14 రోజులు నిర్బంధ పరిశీలనలో ఉండి వచ్చాక చిన్నారికి పాజిటివ్‌ వచ్చింది.

కరోనాను జయించిన వృద్ధుడు

బనగానపల్లికి చెందిన 69 సంవత్సరాల వృద్ధుడు కరోనాతో స్థానిక సర్వజన వైద్యశాలలో చేరారు. ఆయన పూర్తిగా కోలుకోవటంతో సోమవారం ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్‌ రామప్రసాద్‌, ఉప పర్యవేక్షకుడు డాక్టర్‌ నరసింహులు ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. జిల్లాలో 69 సంవత్సరాల వ్యక్తి వైరస్‌ను జయించడం గొప్ప విషయమని, దీనికి ఆసుపత్రి వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది కృషి ఉందని పర్యవేక్షకుడు తెలిపారు.

కరోనా వ్యాప్తి నియంత్రణకు చర్యలు

ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్‌ల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర పోలీసు శాఖ అదనపు డీజీపీ శ్రీధర్‌ రావు పేర్కొన్నారు. కర్నూలు రేంజ్‌ డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ డాక్టర్‌ కె.ఫక్కీరప్ప, అధికారులతో సమీక్షించారు. మ్యాప్‌ ద్వారా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్‌లను పరిశీలించారు. శ్రీధర్‌రావు మాట్లాడుతూ గ్రీన్‌ జోన్‌లలో కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అదనపు ఎస్పీ గౌతమి సాలి, డీఎస్పీ రమణమూర్తి, శిక్షణ డీఎస్పీలు భవ్య కిశోర్‌ పాల్గొన్నారు.

కర్నూలులో రెడ్‌జోన్‌లో ఎత్తు పెంచిన బారీకేడ్లు

17 క్వారంటైన్‌ కేంద్రాల్లో 1052 మంది బస

రాష్ట్రంలో ఉత్తమ క్వారంటైన్ల నిర్వహణ జిల్లాగా కర్నూలుకు పేరుందని కలెక్టర్‌ జి.వీరపాండియన్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 24 క్వారంటైన్ల పరిధిలో 1,755 మంది ఉండగా, 703 మంది డిశ్ఛార్జ్‌ కావడంతో ఏడు ఖాళీ అయ్యాయని, మిగిలిన 17 కేంద్రాల్లో 1,052 మంది ఉన్నారని పేర్కొన్నారు. ఇక్కడి వారికి మూడు పూటలా భోజనం, డ్రైఫ్రూట్స్‌, కోడి గుడ్డు, అరటి పండు, చపాతీ, జొన్న రొట్టె, స్వీట్స్‌, పిల్లలకు పాలు, బ్రెడ్‌, సురక్షిత తాగునీరు అందిస్తున్నామని తెలిపారు. నంద్యాల చెక్‌పోస్టు సమీపంలోని మెగాసిరి ఫంక్షన్‌ హాల్‌లో ప్యాక్‌ చేయించి జిల్లా కేంద్రం సమీపంలోని 11 కేంద్రాలకు పంపుతున్నామని తెలిపారు.

క్వారంటైన్‌ కేంద్రాల్లో పౌష్టికాహార భోజనం

బులెటిన్

కొత్తవి 13

మొత్తం కేసులు 292

చికిత్స పొందుతున్నవారు 252

కోలుకున్న వారు 43

మరణాలు 09

ఇది చదవండి జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.