ETV Bharat / state

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా... తొలిదశ ఎన్నికలు పూర్తి - కర్నూలు జిల్లాలో ముగిసిన తొలి దశ ఎన్నికలు

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా తొలి విడత ఎన్నికలు ముగిశాయి. 6 కొత్త పంచాయతీలతో పాటు.. 5 గిరిజన తండాలకు మెుదటి సారిగా ఎన్నికలు నిర్వహించారు. పలు చోట్ల ఉత్కంఠ భరితంగా ఎన్నిక సాగింది.

first phase elections
కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన తొలిదశ ఎన్నికలు
author img

By

Published : Feb 11, 2021, 3:36 PM IST

కర్నూలు జిల్లాలో తొలి విడత ఎన్నికల పర్వం ముగిసింది. 141 పంచాయతీలకు ప్రథమ పౌరులను ప్రకటించారు. మంగళవారం రాత్రి వరకు 91 పంచాయతీలకు ఓట్ల లెక్కింపు జరిగి ఉప సర్పంచులను ప్రకటించారు. మిగిలిన పంచాయతీలకు బుధవారం వార్డు సభ్యులు ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. తొలి దశలో ఆరు కొత్త పంచాయతీలకు, ఐదు తండాలకు తొలిసారి సర్పంచులుగా ఎంపికయ్యారు. మైనర్‌ పంచాయతీల మధ్య నువ్వా-నేనా అన్నట్లు ఉత్కంఠగా మారాయి. ఇక జిల్లాలో మేజర్‌ పంచాయతీలు మొత్తం ఎస్సీ మహిళ, ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. తొలి విడతలోని పెద్ద పంచాయతీలను కైవసం చేసుకుని మహిళా సర్పంచులు పీఠం ఎక్కారు.

* తొలిదశ ఎన్నికలు జరిగిన 12 మండలాల పరిధిలో అత్యధిక ఓటర్లు కలిగిన మేజర్‌ పంచాయతీలు వెలుగోడు(20,211), చాగలమర్రి(16,174), శిరివెళ్ల(13,203) ఉన్నాయి. వెలుగోడు ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయింది. వేల్పుల జైపాల్‌ 810 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 20 వార్డులు ఉండగా, 17 వార్డుల్లో గెలిచిన అభ్యర్థికి అనుకూలంగా నిలిచాయి. చాగలమర్రి మేజర్‌ పంచాయతీలో 11,494 ఓట్లు పోలయ్యాయి. 5,667 ఓట్ల అత్యధిక మెజార్టీతో తులసమ్మ పెద్ద పంచాయతీ పీఠం దక్కించుకున్నారు. ఈ పంచాయతీలో 19 వార్డులు ఒక వర్గం, ఒక వార్డు ప్రత్యర్థి వర్గానికి అనుకూలంగా ఓట్లు పడ్డాయి. శిరివెళ్లలో ఎల్‌.సాలమ్మ 354 ఓట్ల వ్యత్యాసంతో సర్పంచిగా గెలుపొందారు.

*రుద్రవరం మేజర్‌ పంచాయతీలో 5,134 ఓట్లు పోలయ్యాయి. విజయలక్ష్మి 861 ఓట్ల మెజార్టీతో గెలుపు సొంతం చేసుకున్నారు.

* గోస్పాడు మండలంలోని యాళ్లూరు 6,786 ఓటర్లున్న మేజర్‌ పంచాయతీ. గడ్డం రత్నమ్మ 151 ఓట్ల మెజార్టీతో ప్రత్యర్థిపై గెలుపొందారు.

*ఎర్రగుంట్ల సుభాన్‌అలీ 460 ఓట్ల ఆధిక్యంతో గెలుపు సొంతం చేసుకున్నారు.

*కానాల మేజర్‌ పంచాయతీలో హుస్సేనమ్మపై దూదేకుల బావమ్మ 1,003 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

వారికైతే రీ-కౌంటింగ్‌

ఓట్ల లెక్కింపు పూర్తయి ఫలితాలు వచ్చాక గెలవకపోతే పట్టుబట్టి మరీ రీ-కౌంటింగ్‌ చేయాలని ఒక వర్గం సర్పంచి అభ్యర్థులు కోరడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అదే ప్రత్యర్థి వర్గం రీ-కౌంటింగ్‌ కోరితే ససేమిరా అంటున్నారు. గొడుగునూరులో ప్రధాన వర్గానికి ఆరు ఓట్ల మెజార్టీ వచ్చినట్లు ఆర్వో తొలుత తెలిపారు. ప్రత్యర్థి వర్గానికి చెందిన ఓట్లను చెల్లని ఓట్లు అని పక్కన పెట్టడంతో తిరిగి లెక్కించాలని ప్రత్యర్థి వర్గం కోరినా పోలీసులు హడావుడి చేసి లెక్కింపు ప్రక్రియ లేకుండా అధికార పార్టీ వర్గం గెలిచినట్లుగా ప్రకటించారు. అదే మండలం చింతలచెరువు పంచాయతీలో ప్రతిపక్ష పార్టీ మద్దతుతో బరిలో దిగిన మాధవి 30 ఓట్ల మెజార్టీతో గెలవగా, ప్రత్యర్థి వర్గం మూడు సార్లు రీకౌంటింగ్‌ చేయించారు.
విజేతలను ప్రకటించడంలో జాప్యం ఎందుకు?

పంచాయతీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక వెంటనే విజేతలను ప్రకటించకుండా అధికార పార్టీ సూచనల కోసం కావాలని జాప్యం చేస్తున్నారని తెదేపా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు ఎస్‌ఈసీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రుద్రవరం మండలంలోని నరసాపురంలో ఒక వర్గం అభ్యర్థి శాంతకుమారికి అయిదు ఓట్ల మెజార్టీ రాగా, ప్రత్యర్థి వర్గం పట్టుబట్టి రీ కౌంటింగ్‌ చేయించారు. మళ్లీ అదే అభ్యర్థికి ఎనిమిది ఓట్లు ఆధిక్యం రాగా గెలుపు కైవసం చేసుకున్నారు. డిక్లరేషన్‌ ఇవ్వడానికి జాప్యం చేయడంపై పలు విమర్శలు వస్తున్నాయి. అదే మండలంలోని సి.రంగాపురం పంచాయతీలో సర్పంచి అభ్యర్థి సుబ్బమ్మ తొలుత ఎనిమిది ఓట్ల మెజార్టీ వచ్చింది. దీంతో అధికార పార్టీ ఒత్తిళ్లతో మరోసారి పునఃలెక్కింపు చేపట్టారు. అప్పుడు సైతం అదే మెజార్టీ రావడంతో విజయం సొంతం చేసుకున్నారు.

నో...టా

పంచాయతీ ఎన్నికల్లో తొలిసారి నోటా విధానం ప్రవేశపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో తరహా అభ్యర్థులు నచ్చకపోతే ‘నోటా’ గుర్తుకు ఓటు వేయవచ్చు. దీనిని సైతం పల్లెపోరులో కొందరు ఓటర్లు వినియోగించారు. అయితే ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు ‘నోటా’కు ఎన్ని ఓట్లు పడ్డాయో బుధవారం రాత్రి వరకు ఎలాంటి సమాచారం జిల్లా కేంద్రానికి ఇవ్వలేదు. తొలిదశ ఎన్నికల్లో 2,66,567 ఓట్లు పోలయ్యాయి. ఈ పోలైన ఓట్లలో ఎన్ని నోటాకు పడ్డాయో తెలియాల్సి ఉంది. దీని గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

*దొర్నిపాడు మండలంలో ఆరు పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా, దొర్నిపాడు ఒకే పంచాయతీలో అత్యధికంగా 166 నోటా ఓట్లు పడ్డాయి. మిగిలిన అయిదు పంచాయతీల్లో నోటా ఊసేలేదు.

*నంద్యాల మండలంలోని 13 గ్రామ పంచాయతీల్లో సర్పంచి స్థానాలకు సంబంధించి అభ్యర్థులు ఎవరూ నచ్చలేదంటూ ‘నోటా’కు ఓట్లు 145 వచ్చాయి.

*శిరివెళ్ల మండలంలో 121 వార్డులు, 13 గ్రామ పంచాయతీలకు సంబంధించి 750 పైగా నోటాకు ఓట్లు పడినట్లు అధికారులు గుర్తించారు.

మూడో దశ పరిశీలన అనంతరం....

పల్లెపోరులో మూడో దశకు వచ్చిన నామపత్రాల పరిశీలన మంగళవారం జరిగింది. 14 మండలాల పరిధిలో 245 పంచాయతీలకు సంబంధించి 1,478 సర్పంచి అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు. 2,516 వార్డులకు వచ్చిన నామినేషన్లలో 5,925 పరిశీలనలో అర్హత సాధించాయి. గురువారం తిరస్కరణకు గురైన నామినేషన్లు అప్పీలు చేసుకునే అవకాశం ఇచ్చారు. 12వ తేదీ శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుంది.

ఇదీ చదవండి:

'గుంటూరులో జాతీయ మిర్చి పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.