కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. చెక్‌పోస్టు వద్ద ఉన్న ఓ హోటల్‌లో మూడు గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో అగ్నికీలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. పేలుడుధాటికి చుట్టుపక్కల్లోని గృహసముదాయాల్లోని ప్రజలు భయాందోళతో పరుగులు పెట్టారు. హోటల్ మూడు రోజులుగా మూసి ఉంచడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. హోటల్‌లో 16 సిలిండర్లు ఉండడంతో పోలీసులు యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రధానోపాధ్యాయుడికి కరోనా.. పాఠశాలను శానిటైజ్ చేయకుండానే పాఠాలా?