కర్నూలు జిల్లాలోని డోన్ నుంచి రాయలచెరువుకి 30 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న రోడ్డుకి, 4.5 కోట్లతో డోన్ నుంచి క్రిష్ణగిరికి వెళ్లే రహదారికి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం డోన్ పట్టణంలోని సాయి ఫంక్షన్ హాల్లో గ్రామ, పట్టణ వాలంటరీలు, కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉండే వాలంటరీలు, సచివాలయ సిబ్బంది అంకితభావంతో పని చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలన్నింటినీ అర్హులైన వారందరికీ చేరేలా కృషి చేయాలని తెలిపారు.
ఇదీ చదవండి :