కర్నూలు జిల్లా మహానంది మండలం తమ్మడపల్లి గ్రామానికి చెందిన గోపాల్‌రెడ్డి వ్యవసాయ పని కోసం పొలానికి వెళ్లాడు. పొలంలో పనిచేస్తున్న కాసేపటికే ఉరుములతో కూడిన వర్షం పడింది. గోపాల్‌రెడ్డికి కొద్ది దూరంలో పిడుగు పడింది. పిడుగు శబ్దం ధాటికి అతను అక్కడికక్కడే కుప్పకూలారు. చికిత్స నిమిత్తం బాధితుడిని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
ఇదీచదవండి.