TDP KE Krishnamurthy on Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను ఆ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిరసనలు, రాస్తారోకోలు, ఆందోళనలు, రిలే దీక్షలు చేపట్టారు. చంద్రబాబును అరెస్టు చేసినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బాబు అరెస్టుపై పార్టీలకు అతీతంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. టీడీపీ అభిమానులు అర గుండు చేసుకుని నిరసన తెలిపారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబును విడుదల చేసేంతవరకు తమ ఉద్యమం ఆగదంటూ స్పష్టం చేశారు.
ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లాంటి ఎంతో అనుభవం ఉన్న నాయకుడిని జైల్లో పెట్టడం కన్నీరు తెప్పిస్తోందని మాజీ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నిరసన దీక్షలకు దేవినేని ఉమతో కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. విజయసాయిరెడ్డి తప్పుడు సలహాలు ఇస్తున్నారని అన్నారు. చంద్రబాబును జైల్లో తొక్కి పెడదామని చెప్పడం రాక్షస పాలనకు నిదర్శనం అన్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగనాసురుడు అనే రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్షాలపై తప్పడు కేసులు పెడుతూ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి పరీక్ష పెట్టారన్నారు. సీఎం జగన్‌పై 38 సివిల్ క్రిమినల్, క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు త్వరలో విడుదల అవుతారని ఆయన తెలిపారు.
"సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును జైల్లో పెట్టడం కన్నీరు తెప్పిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. విజయసాయిరెడ్డి తప్పుడు సలహాలు ఇస్తున్నారు. చంద్రబాబును జైల్లో తొక్కి పెడదామని చెప్పడం రాక్షస పాలనకు నిదర్శనం." - కేఈ కృష్ణమూర్తి, మాజీ ఉప ముఖ్యమంత్రి
మోత మోగిన ఆంధ్రప్రదేశ్... రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిన చంద్రబాబు అభిమానులు
"రాష్ట్రంలో జగనాసురుడు అనే రాక్షస పాలన కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్షాలపై తప్పడు కేసులు పెడుతూ డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి పరీక్ష పెట్టారు. సీఎం జగన్‌పై 38 సివిల్ క్రిమినల్, క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఓటు అనే ఆయుధంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు." - దేవినేని ఉమా, మాజీ మంత్రి