శ్రీశైలంలో రేపట్నుంచి పరోక్ష ఆర్జిత లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో రామరావు తెలిపారు. పౌర్ణమి సందర్భంగా ఈ వేడుకను జరుపుతున్నట్లు చెప్పారు. తొలిసారిగా భ్రమరాంబదేవికి పరోక్ష ఆర్జిత సేవలను చేపడుతున్నట్లు వెల్లడించారు. కొవిడ్ కారణంగా భక్తుల సౌకర్యార్థం ఈ విధానాన్ని తీసుకువచ్చినట్లు వివరించారు. ఈ సేవలను భక్తులు ఆన్లైన్ ద్వారా పొందవచ్చునని తెలిపారు.
ఇదీ చదవండీ.. LIVE VIDEO: ఉప్పాడ తీరంలో బోటు బోల్తా.. రక్షించిన మత్స్యకారులు