కర్నూలులో కరోనా పెరుగుతున్నందున ఆంక్షలను మరింత కఠినంగా అమలు చేస్తామని డీఎస్పీ మహేశ్ తెలిపారు. నేటి నుంచి వ్యాపారాల నిర్వహణకు మధ్యాహ్నం రెండు గంటల వరకు అనుమతి ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత ఎవరైనా దుకాణాలు తెరిచి ఉంచితే కేసులు పెడతామని హెచ్చరించారు. సాయంత్రం ఆరు గంటల నుండి కర్ఫ్యూ విధిస్తామన్నారు. ఆస్పత్రులు, మెడికల్ షాపులకు అనుమతి ఉంటుందని చెప్పారు. హోటళ్లలో పార్సల్స్కు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ప్రజలంతా నిబంధనల అమలుకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: అమలాపురంలో ఒక్కరోజే కరోనాతో 10 మంది మృతి