కర్నూలు జిల్లా ఆదోని పత్తి మార్కెట్ యార్డు సీసీఐ కార్యాలయంలో వారం రోజుల క్రితం డిజిటల్ సంతకం దొంగతనం జరిగింది. దొంగిలించిన వ్యక్తిని నిఘా కెమెరాల ద్వారా గుర్తించి అధికారులు పట్టుకున్నారు. దొంగిలించిన వ్యక్తి మరోసారి కార్యాలయానికి రావటంతో సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. పత్తికొండకు చెందిన హనుమంతు అని గుర్తించారు. విలేకరిగా చలామణి అవుతూ ఇలాంటి పనులు చేస్తున్నట్లు వ్యవసాయ అధికారులు తెలుసుకున్నారు. డిజిటల్ సంతకం స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగిస్తామని యార్డు కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి:కర్నూలులో బ్యాంక్ ఉద్యోగుల ధర్నా