నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో 60 ఎకరాల భూమిని వైద్యకళాశాలకు కేటాయించడాన్ని నిరసిస్తూ రాయలసీమ సాగు సాధన సమితి నాయకులు, రైతులు ధర్నా చేశారు. భూములు కాపాడుకుందామని పరిశోధనా స్థానం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. ఎంతో ప్రాధాన్యం ఉన్న వ్యవసాయ పరిశోధనా స్థానం భూములను ఇలా నాశనం చేయడం ప్రభుత్వానికి తగదని రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి అన్నారు. ప్రభుత్వం వైద్యకళాశాల ఏర్పాటు చేయాలంటే మరోచోట భూములు ఉన్నాయని సూచించారు. వ్యవసాయ పరిశోధన స్థానంలో వైద్యకళాశాల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టరు సంపత్కుమార్కు సమితి నాయకులు, రైతులు వినతిపత్రం అందజేశారు.
ఇది చదవండి అచ్చెన్నాయుడి అరెస్టును వ్యతిరేకిస్తూ.. తెదేపా నేతల నిరసన