శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరింత తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు వివిధ అవసరాల కోసం ప్రతిరోజు 24,426 క్యూసెక్కులు నీటిని వినియోగించుకున్నాయి. ఇన్ ఫ్లో మాత్రం 9,162 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.30 అడుగుల నీటి నిల్వ ఉంది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 200.65 టీఎంసీల నిల్వ ఉందని అధికార్లు వెల్లడించారు. కల్వకుర్తి ఎత్తిపోతలకు2,400, హంద్రీనీవాకు 2,026, పోతిరెడ్డిపాడుకు 20,000 క్యూసెక్కులు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు .
ఇదీ చూడండి