అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలని సీపీఐ రామకృష్ణ డిమాండ్ చేశారు. అది సాధ్యం కాకుంటే జ్యుడీషియల్ విచారణ చేపట్టాలన్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో సలాం కుటుంబసభ్యులను ఆయన పరామర్శించారు.
సలాం బంధువులకు అండగా ఉంటామని రామకృష్ణ ధైర్యం చెప్పారు. సీఐ సోమశేఖర్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ గంగాధర్‌లను వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు. సలాం కుటుంబానికి న్యాయం జరగకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇవీ చదవండి..
రేపటినుంచి రాష్ట్రవ్యాప్తంగా గృహ ప్రవేశాల కార్యక్రమం: సీపీఐ రామకృష్ణ