కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. శ్రీశైలం మండలం సున్నిపెంటలో 165 మంది పాఠశాల విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా... 27 మందికి పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ అయ్యింది.
డీఏవీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, శ్రీశైల మాత స్కూల్, విజ్డమ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్, బాలసుబ్రహ్మణ్యం హైస్కూల్లో పరీక్షలు చేశామని జిల్లా విద్యాధికారి సాయిరాం తెలిపారు. అన్ని పాఠశాలల్లోని 9, 10 తరగతుల విద్యార్థులు, ఉపాధ్యాయులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చూడండి: