కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నవంబర్ 26న సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చినట్లు... సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్ తెలిపారు. కార్మికులకు అన్నీ చేస్తామనిచెప్పి... అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిందేమీ లేదని కర్నూలులో ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సైతం కార్మికుల చట్టాలను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొంటున్నాయని వివరించారు.
ఇవీ చూడండి...