కర్నూలు జిల్లాలో ప్రసన్నకుమార్ అనే చర్చ్ పాస్టర్ ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా(church father sexually assaulted two girls) ప్రవర్తించాడు. ఈ ఘటన గత నెల 16న జరిగినప్పటికీ.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగిన రోజున బాలికలు వెంటనే విషయాన్ని తమ తల్లిదండ్రులకు తెలియజేశారు.
అయితే.. గ్రామ పెద్దలు, పోలీసుల సమక్షంలో రాజీ ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. రాజీ వ్యవహారంలో కొంత డబ్బు చేతులు మారినట్టు తెలుస్తోంది. అయితే.. ఈలోగానే చర్చి పాస్టర్ పై వచ్చిన ఆరోపణలను నిరూపించే వీడియోను కొందరు గ్రామస్తులు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దీంతో.. విషయం వెలుగులోకి వచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు చర్చి పాస్టర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి:
THREE CAPITALS: 'మూడు రాజధానులకే మా మద్ధతు.. అందుకు ఎంతవరకైనా వెళ్తాం'