కర్నూలు జిల్లా హాలహర్వి మండలంలోని బాపురం పంచాయితీలో 1,737 మంది ఓటర్లు ఉన్నారు. పంచాయతీ జనరల్ మహిళకు రిజర్వ్ అయ్యింది. బాపురం, మజరా గ్రామమైన పచ్చారపల్లిలో ఓటర్లకు గాలం వేసేందుకు అభ్యర్ధులు కోళ్లను పంచిపెట్టడం విశేషం. ఎన్నికల బరిలో నిలిచిన ఓ అభ్యర్థి తనకు ఓటు వేయాలంటూ.. ఇంటికో కోడిని పంచిపెట్టాడు. ఇదేదో బాగుందని.. ఓటర్లంతా కోళ్లను తీసుకుంటున్నారు.
నేనేమైనా తక్కువ తిన్నానా...
ఈ విషయం తెలిసిన ప్రత్యర్థి నేనేమైనా తక్కువ తిన్నానా.. మీరు ఒకటి పంచితే నేను రెండు పంచుతానంటూ పోటీ పడ్డాడు. ఇంటికి రెండు కోళ్ల చొప్పున ఇచ్చేశాడు. ముందు ఇచ్చిన కోడి కోసుకు తిన్న జనం.. వెంట వెంటనే కోడి మాంసం తినలేక తరువాత వచ్చిన రెండు కోళ్లు ఇంటి దగ్గర ఉంటే చనిపోతాయని.. అవసరమైనప్పుడు తీసుకుంటామని చికెన్ సెంటర్ నిర్వహించే వ్యక్తికి అప్పజెప్పటం కొసమెరుపు.
ఇదంతా సరేగానీ.. మూడు కోళ్లు తీసుకున్న ఓటర్లు.. ఎవరికి ఓటు వేస్తారనేది ఆసక్తిగా మారింది.
ఇవీ చూడండి...