అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తమ భూమిని దౌర్జన్యంగా తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని భాజపా ఆధ్వర్యంలో బాధితులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. నంద్యాల సమీపంలోని ఐలూరు గ్రామంలో రజకులు, ముస్లింలకు చెందిన 60 సెంట్ల భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశామన్నారు. తమ భూమికి లాయర్ నోటీసులు పంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఇదీ చదవండి